Sree Leela: శ్రీలీల చేతుల మీదుగా 'గాళ్ ఫ్రెండ్ మండి' కొత్త బ్రాంచి ప్రారంభోత్సవం... ఫొటోలు  ఇవిగో!

Sree Leela attends Girl Friend Mandi new branch in Hyderabad

  • బంజారాహిల్స్ లో గాళ్ ఫ్రెండ్ మండి ప్రారంభోత్సవం
  • ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీలీల
  • తాను ఫుడ్ లవర్ నని వెల్లడించిన యువ హీరోయిన్ 

ఇటీవల కాలంలో అరబిక్ మండి స్టయిల్ రెస్టారెంట్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే హైదరాబాదులో పలు బ్రాంచిలను కలిగి ఉన్న గాళ్ ఫ్రెండ్ మండి రెస్టారెంట్ తాజాగా బంజారాహిల్స్ లో కొత్త బ్రాంచి నెలకొల్పింది. ఈ నూతన బ్రాంచి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా టాలీవుడ్ యువ హీరోయిన్ శ్రీలీల విచ్చేశారు. జలగం వెంగళరావు పార్క్ ఎదురుగా ఉన్న గాళ్ ఫ్రెండ్ మండి కొత్త బ్రాంచిను ఆమె ప్రారంభించారు. 

ఈ సందర్భంగా శ్రీలీల మీడియాతో మాట్లాడారు. తాను ఫుడ్ లవర్ నని వెల్లడించారు. గాళ్ ఫ్రెండ్ మండి కొత్త బ్రాంచి తన చేతులమీదుగా ప్రారంభోత్సవం జరుపుకోవడం సంతోషం కలిగిస్తోందని తెలిపారు. 

ఈ క్రమంలో గాళ్ ఫ్రెండ్ మండి రెస్టారెంట్ యజమాని కదిరేశన్ మాట్లాడుతూ... తమకు ఇప్పటికే గచ్చిబౌలి, మాదాపూర్ లో బ్రాంచిలు ఉన్నాయని, ఇప్పుడు బంజారాహిల్స్ లోనూ బ్రాంచి ఓపెన్ కావడం సంతోషంగా ఉందని తెలిపారు. తమ వద్ద అన్ని రకాల నాన్ వెజ్, వెజ్ ఐటమ్స్ లభిస్తాయని చెప్పారు.

Sree Leela
Girl Friend Mandi
New Branch
Banjara Hills
Hyderabad
Tollywood
  • Loading...

More Telugu News