Allu Arjun: బెర్లిన్‌ బయలుదేరిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

Icon star Allu Arjun leaves for Berlin for Berlin Film Festival
  • ‘బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌’లో పాల్గొననున్న పాన్ ఇండియా స్టార్
  • ఇంటర్నేషనల్ మూవీ ఫెస్టివల్‌లో పుష్ప మూవీ ప్రత్యేక స్క్రీనింగ్
  • పలువురు దర్శకులు, నిర్మాతలు, అంతర్జాతీయ మీడియాతో మాట్లాడనున్న అల్లు అర్జున్
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ‘బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌’ పాల్గొనేందుకు బెర్లిన్ బయలుదేరాడు. ఈ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ ‘పుప్ప: ది రైజ్’ని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. కాగా తన పర్యటనలో భాగంగా ఇంటర్నేషనల్ దర్శకులు, చిత్ర నిర్మాతలు, మార్కెట్‌లో సినిమా హక్కుల కొనుగోలుదారులతో మాట్లాడనున్నాడు. ‘పుష్ప’ మూవీ స్క్రీనింగ్‌లో భాగంగా ఇంటర్నేషనల్ మీడియాతో ఐకాన్ స్టార్ మాట్లాడతాడు. కాగా పుష్ప సినిమా రష్యా, అమెరికా, గల్ఫ్ దేశాలు, ఆస్ట్రేలియా, యూకేతో పాటు ఇతర దేశాల్లోనూ కూడా ‘పుష్ప: ది రైజ్‌’ సినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

కాగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పుష్ప-2: ది రూల్’ మూవీ ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీస్’ ఈ మధ్యే అధికారికంగా ప్రకటించింది. ‘200 రోజుల్లో పుష్ప రాజ్ పాలన ఆరంభం’ అని పేర్కొంటూ సినిమా విడుదల తేదీని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Allu Arjun
Berlin Film Festival
Pushpa
Icon star
Tollywood

More Telugu News