traffic challan: నేటి అర్ధరాత్రితో ముగుస్తోన్న పెండింగ్ ట్రాఫిక్ చలాన్ గడువు

Pending traffic challan dead line end today
  • నేటి రాత్రి 11.59 గంటల వరకే డిస్కౌంట్‌తో చెల్లించే అవకాశం
  • మరోసారి గడువును పొడిగించే అవకాశం లేదంటోన్న అధికారులు
  • పెండింగ్ ట్రాఫిక్ చలాన్లతో ఖజానాకు రూ.147 కోట్ల ఆదాయం
పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల గడువు నేటితో ముగుస్తోంది. ఈ రోజు రాత్రి 11.59 గంటల వరకు పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను డిస్కౌంట్‌తో చెల్లించవచ్చు. అంటే డిస్కౌంట్‍తో చెల్లించేందుకు మరో మూడు లేదా మూడున్నర గంటల సమయం మాత్రమే ఉంది. చలాన్ల గడువును ఇప్పటికే రెండుసార్లు పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం మరోసారి పొడిగించే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. చలాన్ల రూపంలో ఇప్పటి వరకు ఖజానాకు రూ.147 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పటి వరకు ఒక కోటి అరవై ఆరు లక్షల పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యాయి.
traffic challan
Telangana
Congress

More Telugu News