Mithun Chakraborty: తీవ్ర అస్వస్థతకు గురైన మిథున్ చక్రవర్తి... హుటాహుటీన ఆసుపత్రికి తరలింపు

Mithun Chakraborty hospitalised due to severe illness

  • ఈ ఉదయం ఛాతీ నొప్పికి గురైన మిథున్ చక్రవర్తి
  • కోల్ కతాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స
  • దేశవ్యాప్తంగా ఉన్న అభిమానుల్లో ఆందోళన

బాలీవుడ్ సీనియర్ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి (73) ఛాతీలో నొప్పితో ఆసుపత్రిలో చేరారు. మిథున్ చక్రవర్తి కోల్ కతాలోని తన నివాసంలో ఈ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఆయనకు కోల్ కతాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మిథున్ చక్రవర్తిని ఆసుపత్రికి తరలించారన్న వార్తతో దేశవ్యాప్తంగా  ఉన్న ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఆయన ప్రస్తుత పరిస్థితిపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో అభిమానులు కంగారు పడుతున్నారు.

Mithun Chakraborty
Chest Pain
Hospital
Kolkata
Bollywood
  • Loading...

More Telugu News