YS Sharmila: కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని మాటిస్తున్నా: వైఎస్ షర్మిల

YS Sharmila attends Rajanna Rachabanda program in Kolakaluru
  • తెనాలి నియోజకవర్గం కొలకలూరులో రాజన్న రచ్చబండ
  • హాజరైన వైఎస్ షర్మిల
  • ప్రజలు కంటతడి పెట్టడం కలచివేసిందన్న పీసీసీ చీఫ్
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు తెనాలి నియోజకవర్గం కొలకలూరులో 'రాజన్న రచ్చబండ' కార్యక్రమం నిర్వహించారు. దీనిపై ఆమె సోషల్ మీడియాలో స్పందించారు. రచ్చబండ కార్యక్రమంలో ప్రజలంతా తమ సమస్యలను ఏకరవు పెడుతూ కంటతడి పెట్టడం కలచివేసిందని షర్మిల పేర్కొన్నారు. 

"జగనన్న ఏమో తమ పాలన అద్భుతం అంటున్నారు. ప్రజలేమో అధ్వానం అంటున్నారు. పింఛను రావడంలేదని, ఇళ్లు లేవని బాధపడుతున్నారు. ఉపాధి దొరకడం లేదని చెబుతున్నారు... యువతకు ఉద్యోగాలు లేవంటున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేదలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు కూడా లేవని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మీకు ప్రజలే గట్టి బుద్ధి చెబుతారు. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తే ఏపీకి ప్రత్యేక హోదా తీసుకువస్తానని మాటిస్తున్నా. గత రెండు ప్రభుత్వాలు సృష్టించిన సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాం" అంటూ షర్మిల ట్వీట్ చేశారు.
YS Sharmila
AP Special Status
Congress
Andhra Pradesh

More Telugu News