Uniform Civil Code: ‘లివిన్ రిలేషన్‌షిప్’ను కూడా రిజిస్టర్ చేసుకోవాల్సిందే.. లేదంటే జైలే!

Now To Register Live In Relationships In Uttarakhand

  • ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఉమ్మడి పౌరస్మృతి బిల్
  • జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాల మధ్య బిల్లును ప్రవేశపెట్టిన సీఎం పుష్కర్‌సింగ్ ధామి
  • చట్టంగా మారితే లివిన్ రిలేషన్‌ను రిజిస్టర్ చేసుకోవాల్సిందే
  • లేదంటే ఆరు నెలల జైలు శిక్ష

ఉత్తరాఖండ్‌లో ఇకపై లివిన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు తప్పకుండా జిల్లా అధికారుల వద్ద తమ సంబంధాన్ని రిజిస్టర్  చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే కటకటాల వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్) బిల్లును ఉత్తరాఖండ్ ప్రభుత్వం నేడు శాసనసభలో ప్రవేశపెట్టింది. ‘జై శ్రీరామ్’, ’భారత్ మాతాకీ జై’ నినాదాల నడుమ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి బిల్లును ప్రవేశపెట్టారు. 

ఈ బిల్లు కనుక ఆమోదం పొంది చట్టంగా మారితే లివిన్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్లాలనుకుంటున్న యువతీయువకులతోపాటు ఇప్పటికే అందులో ఉన్నవారు తప్పకుండా జిల్లా అధికారుల వద్ద తమ బంధాన్ని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, వారి వయసు 21 నిండి ఉండడంతోపాటు తల్లిదండ్రుల అనుమతి కూడా అవసరం. అయితే, ఇది ప్రజా నైతికతకు వ్యతిరేకంగా ఉంటే మాత్రం రిజిస్టర్ చేయరు. అంటే జంటలో ఒకరికి ఇప్పటికే వివాహమైనా, మరొకరితో రిలేషన్‌లో ఉన్నా, భాగస్వామి మైనర్ అయినా ఆ బంధాన్ని రిజిస్టర్ చేయరు. అలాగే, బలవంతంగా కానీ, గుర్తింపు వంటివాటిని తప్పుగా చూపించే ప్రయత్నం చేసినా చిక్కుల్లో పడడం ఖాయం.

Uniform Civil Code
Uttarakhand
Live In Relation
  • Loading...

More Telugu News