పూనమ్ పాండే కేన్సర్ ప్రచారంపై క్షమాపణలు చెప్పిన ‘సచ్‌బాంగ్’.. ఆమె తల్లి కూడా అలాగే చనిపోయారన్న ఏజెన్సీ
- గర్భాశయ కేన్సర్‌పై ప్రచారం కోసం చనిపోయినట్టు నమ్మించిన పూనమ్ పాండే
- అవగాహన ఓకే కానీ ప్రచారం తీరు బాగాలేదంటూ విమర్శలు
- అందులో తామూ భాగమయ్యామంటూ డిజిటల్ ఏజెన్సీ క్షమాపణలు
సర్వైకల్ కేన్సర్ కోసం పూనమ్ చేసిన ప్రచారంలో తామూ భాగమయ్యామని, కాబట్టి దీనిపై తాము క్షమాపణలు చెప్పాలనుకుంటున్నామని పేర్కొంది. పూనమ్ తల్లి కూడా ఇదే కేన్సర్‌తో మృతి చెందిన విషయం చాలామందికి తెలియకపోవచ్చని, పూనమ్ తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న విషాదం కారణంగా దానిని అరికట్టాల్సిన అవసరాన్ని గుర్తించి ఇలా ప్రచారం చేయాల్సి వచ్చిందని, దీనివల్ల ఎంతోమంది ఆన్‌లైన్‌లో ఈ కేన్సర్ గురించి సెర్చ్ చేసి తెలుసుకున్నారని వివరించింది. 2022లో భారత్‌లో 1,23,907 గర్భాశయ కేన్సర్ కేసులు నమోదయ్యాయని, 77,348 మంది చనిపోయారని ఏజెన్సీ ఆవేదన వ్యక్తం చేసింది.