Srikalahasti: అర్ధరాత్రి వేళ శ్రీకాళహస్తి ఆలయంలోకి చొరబడిన బాలుడు

Boy enters Srikalahasti temple by ladder at midnight
  • నిచ్చెన ద్వారా ఆలయం గోడ ఎక్కి లోపలికి ప్రవేశించిన బాలుడు
  • బాలుడ్ని గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చిన భక్తులు
  • బాలుడికి మతిస్థిమితం లేదన్న అధికారులు
  • భద్రతా వైఫల్యమేనంటూ భక్తుల ఆగ్రహం
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి ఆలయంలోకి ఓ బాలుడు చొరబడిన ఘటన కలకలం రేపింది. గత అర్ధరాత్రి 13 ఏళ్ల బాలుడు నిచ్చెన ద్వారా ఆలయంలోకి ప్రవేశించినట్టు సీసీటీవీ ఫుటేజిలో కనిపించింది. బాలుడ్ని గుర్తించిన భక్తులు అధికారులకు సమాచారం ఇచ్చారు. బాలుడు ఆలయంలో తిరుగుతున్న దృశ్యాలు సీసీటీవీలో చూసిన అధికారులు, ఘటనపై వివరణ ఇచ్చారు. ఆ బాలుడికి మతిస్థిమితం లేదని వెల్లడించారు. అయితే, భక్తులు మాత్రం ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇది భద్రతా వైఫల్యమేనని మండిపడుతున్నారు.
Srikalahasti
Boy
Temple
Devotees

More Telugu News