Sai Pallavi Dance: చెల్లెలి ఎంగేజ్మెంట్ వేడుకలో సాయి పల్లవి మాస్ డ్యాన్స్.. తాజాగా బయటకొచ్చిన వీడియో ఇదిగో!

Sai Pallavi mass dance at her sisters engagement
  • ఈ నెల 21న పూజా కన్నన్ నిశ్చితార్థం
  • రెండు రోజుల తర్వాత ఫొటోలు బయటపెట్టిన హీరోయిన్ సోదరి
  • తాజాగా వైరల్ గా మారిన సాయిపల్లవి, పూజా కన్నన్ డ్యాన్స్ వీడియో
ప్రముఖ హీరోయిన్ సాయిపల్లవి సోదరి పూజా కన్నన్ కు ఇటీవల తన ప్రియుడితో నిశ్చితార్థం జరిగింది. ఇరుకుటుంబాల సమక్షంలో సింపుల్ గా జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు రెండు రోజుల తర్వాత బయటకు వచ్చాయి. ఇన్ స్టాలో యాక్టివ్ గా ఉండే పూజా కన్నన్.. ఇటీవలే తన ప్రేమ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. తన ప్రియుడిని పరిచయం చేసింది. ఆ వెంటనే ఎంగేజ్మెంట్ కూడా జరగడంతో త్వరలోనే వివాహం జరగనుందని తెలుస్తోంది.

ఈ నెల 21 న జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను పూజ ఇన్ స్టాలో పంచుకుంది. అయితే, ఈ వేడుకకు సంబంధించిన ఓ వీడియో తాజాగా వెలుగుచూసింది. చెల్లెలు ఎంగేజ్మెంట్ వేడుకలో సాయిపల్లవి డ్యాన్స్ చేసిన వీడియోను ఓ అభిమాని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో పూజా కన్నన్ తనకు కాబోయే భర్త, ఇతర బంధువులతో కలిసి డ్యాన్స్ చేస్తుండగా.. సాయిపల్లవి వారితో కలిసి మాస్ డ్యాన్స్ చేయడం చూడొచ్చు.

వీడియో లింక్
Sai Pallavi Dance
Sai pallavi sister
Puja kannan
Engagement
Viral Videos
Instagram

More Telugu News