Rahul Gandhi: అసోంలో రాహుల్ గాంధీపై నమోదైన కేసు సీఐడీకి బదిలీ

Assam police transfer the case against Congress leader Rahul Gandhi to CID

  • అసోంలో భారత్ జోడో న్యాయ యాత్ర..రాహుల్ గాంధీపై కేసు
  • కేసును సీఐడీకి బదిలీ చేసేందుకు రాష్ట్ర పోలీసుల నిర్ణయం
  • దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేయనున్న సీఐడీ

అసోంలోని గువాహటిలో భారత్ జోడో న్యాయ్ యాత్రకు పోలీసులు అనుమతించనప్పటికీ బారికేడ్లు తొలగించుకుని నగరం మీదుగా వెళ్లేందుకు ప్రయత్నించడంతో రాహుల్ సహా పలువురు కాంగ్రెస్ నేతలపై కేసు నమోదైంది. తాజాగా అసోం పోలీసులు ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు. దర్యాప్తు కోసం సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది.

ఇదిలా ఉంటే.. లోక్‌సభ ఎన్నికల తరువాత రాహుల్ గాంధీ అరెస్టవుతారని అసోం సీఎం హిమంతబిశ్వ శర్మ అన్నారు. సిబ్‌సాగర్ జిల్లాలోని నజీరాలో బుధవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో హిమంత మాట్లాడారు. హింసాత్మక ఘటనపై కేసుకు సంబంధించి లోక్‌సభ ఎన్నికల తరువాత రాహుల్ అరెస్టు అవుతారని చెప్పారు.

Rahul Gandhi
Assam
CID
Congress
BJP
  • Loading...

More Telugu News