Arogyashree: నేటి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత.. నెట్‌వర్క్‌ హాస్పిటల్స్ యాజమాన్యాల సంఘం నిర్ణయం

Arogyashree network hospitals to go on strike from Thursday

  • తమ డిమాండ్లను పరిష్కరించకపోవడంతో సమ్మె బాట పట్టిన నెట్‌వర్క్ ఆసుపత్రులు 
  • ప్రస్తుతం అడ్మిషన్‌లో ఉన్న రోగులకు యథావిధిగా చికిత్స అందించనున్నట్టు వెల్లడి
  • కొత్తగా రోగులను చేర్చుకోబోమని తెలిపిన ఆసుపత్రులు 
  • బకాయిల చెల్లింపు, శస్త్ర చికిత్సల ప్యాకేజీల పెంపు కోసం డిమాండ్ చేస్తున్న నెట్‌వర్క్ ఆసుపత్రులు

శస్త్ర చికిత్సల ప్యాకేజీల పెంపు, బకాయి బిల్లుల చెల్లింపు, ఆసుపత్రులు- ట్రస్ట్‌ మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్న ఏపీ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ సమ్మెకు దిగాయి. నేటి (గురువారం) నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. రాష్ట్ర వ్యాప్తంగా నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌ సేవలను నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రుల యాజమాన్య సంఘం తెలిపింది. ప్రస్తుతం అడ్మిషన్లలో ఉన్న రోగులకు యథావిధిగా సేవలు కొనసాగనున్నాయని, కొత్త రోగులను చేర్చుకోబోమని తెలిపాయి.

నిజానికి గత ఏడాది డిసెంబరు 29 నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లు నెట్‌వర్క్ ఆసుపత్రులు ప్రకటించాయి. అయితే ప్రభుత్వం చర్చలకు పిలవడంతో సమ్మెను విరమించుకున్నారు. హామీ మేరకు ప్రభుత్వం డిమాండ్లను నెరవేర్చలేదంటూ ఇప్పుడు మరోసారి సమ్మెకు పిలుపునిచ్చారు.

Arogyashree
rogyashree network hospitals
Strike
Andhra Pradesh
  • Loading...

More Telugu News