వైఎస్ వివేకా హత్యకేసు నిందితుడు దస్తగిరికి ఏపీ హైకోర్టు బెయిల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వైఎస్ వివేకా హత్యకేసు నిందితుడు దస్తగిరికి ఏపీ హైకోర్టు బెయిల్

AP High Court grants bail to Dastagiri
  • ఓ కిడ్నాప్ కేసులో దస్తగిరిని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
  • 86 రోజులుగా కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న దస్తగిరి
  • ఈ సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉండి, అప్రూవర్ గా మారిన షేక్ దస్తగిరికి ఏపీ హైకోర్టు కాసేపటి క్రితం బెయిల్ మంజూరు చేసింది. ఒక కిడ్నాప్ కేసులో దస్తగిరిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో 86 రోజులుగా దస్తగిరి కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. హైకోర్టులో దస్తగిరి తరపున జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఈ సాయంత్రం ఆయన బెయిల్ పై విడుదలయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఈరోజు వీలు కాకపోతే రేపు ఉదయం ఆయన విడుదలవుతారు.  

Advertisement
Dastagiri
YS Vivekananda Reddy
AP High Court
Bail

More Telugu News