Sharukh Khan: ఇంటర్నేషనల్ లీగ్ టీ20-2024..దుబాయ్‌లో షారుఖ్ ఖాన్ సందడి!

Shahrukh attends ILT20 match between mumbai indians emirates and dubai capitals
  • దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ x దుబాయ్ క్యాపిటల్స్ మ్యాచ్
  • మ్యాచ్‌కు అబుదాబి నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ యజమాని షారుఖ్ హాజరు
  • చప్పట్లు, ఈలలతో క్రీడాకారులను ఉత్సాహపరిచిన వైనం
ఇంటర్నేషనల్ లీగ్ టీ20-2024 టోర్నీలో భాగంగా శనివారం దుబాయ్ వేదికగా ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్, దుబాయ్ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌కు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ హాజరయ్యారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కింగ్ ఖాన్ స్టాండ్స్‌లో నిలబడి క్రీడాకారులను ప్రోత్సహించారు. సిక్సర్లు, బౌండరీలు వచ్చిన ప్రతిసారీ చప్పట్లు చరుస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. షారుఖ్‌తో పాటూ దుబాయ్ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కిరణ్ రెడ్డి కూడా మ్యాచ్‌ను వీక్షించారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 

షారుఖ్ ప్రస్తుతం అబుదాబి నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ యజమానిగా ఉన్నారు. గతేడాది జరిగిన ఇంటర్నేషనల్ టీ20 లీగ్ తొలి ఎడిషన్ ప్రారంభ వేడుకలకు సైతం షారుఖ్ హాజరయ్యాడు. 

ఇక అబుదాబి నైట్ రైడర్స్‌ జట్టులో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ వంటి స్టార్ ఆటగాళ్లు భాగమయ్యారు. ఇక తాజా మ్యాచ్‌లో దుబాయ్ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
Sharukh Khan
ILT20 2024
Dubai

More Telugu News