Roja: భర్తతో కలిసి చిలక జోస్యం చెప్పించుకున్న మంత్రి రోజా... వీడియో ఇదిగో!

Roja and Selvamani enjoys Parrot astrology

  • మంత్రి రోజా సంక్రాంతి సంబరాలు
  • కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు
  • తమిళంలో చిలక జోస్యం చెప్పించుకున్న రోజా, సెల్వమణి

సంక్రాంతి వేడుకల సందర్భంగా ఏపీ మంత్రి రోజా తన భర్తతో కలిసి చిలక జోస్యం చెప్పించుకున్నారు. తమిళ చిలక జ్యోతిష్యుడిని పిలిపించిన రోజా దంపతులు... తమ భవిష్యత్తు గురించి ఆసక్తిగా విన్నారు. మొదట రోజా భర్త సెల్వమణి పేరు చెప్పగానే, చిలక ఓ కార్డు తీసింది. దాంతో ఆ జ్యోతిష్యుడు సెల్వమణి జాతకం చెప్పారు. ఆయన తమిళంలో చెబుతుంటే రోజా, సెల్వమణి కొన్నిసార్లు పగలబడి నవ్వారు. ఆ తర్వాత చిలక రోజా కార్డు తీసింది. ఆ జ్యోతిష్యుడు రోజా జాతకాన్ని కూడా చదివి వినిపించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Roja
Selvamani
Parrot Astrology
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News