Saindhav: తెరపై పెరుగుతున్న తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్!

  • తండ్రీ కూతుళ్ల చుట్టూ తిరుగుతున్న కథలు
  • ఆడియన్స్ ఆదరణ పొందుతున్న కంటెంట్  
  • రీసెంటుగా హిట్ కొట్టిన 'హాయ్ నాన్న'
  • ఈ నెల 13న విడుదలవుతున్న 'సైంధవ్'
  • తెలుగు తెరకి పరిచయమవుతున్న చైల్డ్ ఆర్టిస్టులు 

Telugu cinema trend

ఒకప్పుడు తెలుగు తెరపై తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ కథల హవా కొనసాగింది. ఆ తరువాత కాలంలో ఈ తరహా కాన్సెప్ట్ లు ఎక్కువగా రాలేదు. మళ్లీ ఇప్పుడు అవే తరహాలో .. తండ్రీకూతుళ్ల ఎమోషనల్ బాండింగ్ తో సినిమాలు వస్తున్నాయి. 'భగవంత్ కేసరి' సినిమాలో నిజమైన తండ్రీ కూతుళ్లు కాకపోయినా, బాలకృష్ణ - శ్రీలీల అవే స్థానాల్లో కనిపిస్తారు. వారి మధ్య అదే బాండింగ్ ఉంటుంది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 

సిద్ధార్థ్ హీరోగా చేసిన 'చిన్నా' సినిమాలో అతను బాబాయ్ అయినప్పటికీ, తండ్రి స్థానంలోనే కనిపిస్తాడు. తమిళంలో ఆ సినిమా భారీ విజయాన్ని సాధించగా, తెలుగులోను మంచి వసూళ్లనే రాబట్టింది. ఇక రీసెంటుగా వచ్చిన 'హాయ్ నాన్న' సినిమా కూడా తండ్రీకూతుళ్ల నేపథ్యంలో వచ్చిన కథనే. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను మంచి లాభాలను సొంతం చేసుకుంది. 

ఇక ఇప్పుడు వెంకటేశ్ హీరోగా చేసిన 'సైంధవ్' కూడా ఫాదర్ - డాటర్ మధ్య సాగే ఎమోషనల్ డ్రామానే. శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 13వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాలో వెంకటేశ్ కూతురుగా బేబీ 'సారా పాలేకర్' నటించింది. ఈ సినిమాలో ఆ పాపనే హీరో అని వెంకటేశ్ చెప్పడం గమనించవలసిన విషయం. మొత్తానికి ఈ తరహా కాన్సెప్టుల వలన తెలుగు తెరపై మళ్లీ చైల్డ్ ఆర్టిస్టులు కనిపిస్తుండటం శుభపరిణామం. 

  • Loading...

More Telugu News