Yash: నటుడు యశ్ బర్త్ డే వేడుకల్లో విషాదం.. బ్యానర్ కడుతూ విద్యుదాఘాతంతో ముగ్గురి మృతి

3 electrocuted while putting up banner for Kannada star Yashs birthday

  • కర్ణాటకలోని గడగ్ జిల్లాలో ఘటన
  • తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు
  • నేడు 38వ బర్త్ డే జరుపుకొంటున్న యశ్

ప్రముఖ కన్నడ నటుడు యశ్ బర్త్ డే వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన 38వ బర్త్ డేను పురస్కరించుకుని అభిమానులు బ్యానర్ ఏర్పాటు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ముగ్గురు అభిమానులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కర్ణాటకలోని గడగ్ జిల్లా లక్ష్మేశ్మర్ తాలూకాలోని సురంగి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

 యశ్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. 2007లో ‘జంబడ హుడుగి’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత ‘రాకీ’ (2008), ‘గూగ్లీ’ (2013, ‘మిస్టర్ అండ్ మిస్ రామాచారి’ (2014) సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ స్థానం సంపాదించుకున్నాడు. కేజీఎఫ్ సిరీస్‌తో ఏకంగా పాన్ ఇండియా స్టార్‌‌గా మారిపోయాడు.

Yash
Kannada Star
Yash Birthday
Sandalwood
  • Loading...

More Telugu News