Gudivada Amarnath: కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్న ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్.. ఫ్యామిలీ ఫొటో ఇదిగో

AP Minister Gudivada Amarnath visited Kashi Vishwanath on the first day of the new year 2024
  • కుటుంబ సమేతంగా కాశీని సందర్శించిన మంత్రి
  • ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించినట్టు వెల్లడి
  • ఫ్యామిలీ ఫొటోని షేర్ చేసిన గుడివాడ అమర్నాథ్
ఏపీ మంత్రి, వైఎస్సార్‌సీపీ కీలక నేత గుడివాడ అమర్‌నాథ్ నూతన సంవత్సరం 2024 తొలి రోజును ఆధ్యాత్మికంగా గడిపారు. కుటుంబ సమేతంగా పవిత్ర వారణాసి నగరంలోని కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు. స్వామి వారి ఆలయంలో ప్రార్థనలు చేశారు. ఈ విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ ఫొటోని ఆయన పంచుకున్నారు.

ఈ కొత్త సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషంగా, ప్రశాంతంగా, ఏ విధమైన లోటుపాట్లు లేకుండా శ్రేయస్కరంగా ఉండాలంటూ కోరుకున్నానని రాసుకొచ్చారు. తన కుటుంబసభ్యులతో కలిసి కాశీని సందర్శించానని తెలిపారు.
Gudivada Amarnath
Kashi Vishwanath
new year 2024
Andhra Pradesh
YSRCP

More Telugu News