Team India: టీమిండియా-దక్షిణాఫ్రికా టెస్టుపై వర్షం ప్రభావం... ఆలస్యంగా టాస్

Team India put into bat first after SA won the toss in 1st Test

  • నేటి నుంచి రెండు టెస్టుల సిరీస్
  • సెంచురియన్ లో తొలి టెస్టు
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆతిథ్య దక్షిణాఫ్రికా

నేటి నుంచి టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ జరగనుంది. సెంచురియన్ లో ఇవాళ తొలి టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. గతరాత్రి బాగా వర్షం పడడంతో ఇక్కడి సూపర్ స్పోర్ట్ పార్క్ మైదానం తడిసి ముద్దయింది. మైదానం చిత్తడిగా ఉండడంతో దాదాపు 45 నిమిషాల పాటు టాస్ ఆలస్యం అయింది. టాస్ ఓడిపోవడంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. 

కాగా, ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, సిరాజ్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు ఆడుతుండడంతో టీమిండియా కళకళలాడుతోంది. ఈ మ్యాచ్ ద్వారా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ టెస్టు క్రికెట్ అరంగేట్రం చేస్తున్నాడు. రవీంద్ర జడేజా స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ ఆడుతున్నాడని కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు.

టీమిండియా...
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మాన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

దక్షిణాఫ్రికా...
టెంబా బవుమా (కెప్టెన్), డీన్ ఎల్గార్, టోనీ డి జోర్జి, ఐడెన్ మార్ క్రమ్, కీగాన్ పీటర్సన్, డేవిడ్ బెడింగ్ హామ్, కైల్ వెర్రీన్ (వికెట్ కీపర్), మార్కో యన్సెన్, గెరాల్డ్ కోట్జీ, కగిసో రబాడా, నాండ్రే బర్గర్.

Team India
Toss
Batting
South Africa
Centurian
1st Test
  • Loading...

More Telugu News