Manickam Tagore: ఏపీ కాంగ్రెస్ ఇన్చార్జిగా మాణికం ఠాగూర్ నియామకం

AICC appointed Makickam Tagore as AP Congress Incharge

  • త్వరలో సార్వత్రిక ఎన్నికలు
  • పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త ఇన్చార్జిలను నియమించిన కాంగ్రెస్
  • ఉత్తర్వులు జారీ చేసిన కేసీ వేణుగోపాల్

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త ఇన్చార్జిలను నియమించింది. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా మాణికం ఠాగూర్ ను నియమించింది. మాణికం ఠాగూర్ కు అండమాన్ అండ్ నికోబార్ దీవుల కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతలు కూడా అప్పగించింది. 

ఇక దీపా దాస్ మున్షీని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా నియమించారు. ఇప్పటివరకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా మాణిక్ రావ్ ఠాక్రే వ్యవహరించారు. 

అటు, కర్ణాటక కాంగ్రెస్ ఇన్చార్జిగా రణదీప్ సింగ్, తమిళనాడు-పుదుచ్చేరి-ఒడిశా ఇన్చార్జిగా డాక్టర్ అజయ్ కుమార్ లను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. 

Manickam Tagore
Incharge
Andhra Pradesh
Congress
Telangana
AICC
  • Loading...

More Telugu News