TS DGP: న్యూఇయర్ వేడుకల సందర్భంగా అప్రమత్తంగా ఉండండి: డీజీపీ రవిగుప్తా

DGP Ravi Gupta orders to police on new year events

  • నార్కోటిక్ బ్యూరో అధికారులు, కమిషనర్లు, ఉన్నతాధికారులతో డీజీపీ సమీక్ష
  • డ్రగ్స్ నియంత్రణపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచన
  • ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలని ఆదేశాలు 

2024 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవిగుప్తా... నార్కోటిక్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనపై డీజీపీ రవిగుప్తా శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో నార్కోటిక్ బ్యూరో అధికారులు, కమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ... డ్రగ్స్ నియంత్రణపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. నూతన సంవత్సరం పేరుతో సంబరాలు జరుపుకుంటారని, అయితే పోలీసు సిబ్బంది అలర్ట్‌గా ఉండాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి, డ్రగ్స్ రాకుండా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలన్నారు.

TS DGP
Telangana
New Year 2024
drugs
  • Loading...

More Telugu News