Hyderabad Police: హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!

Traffic restrictions in hyderabad ahead of christmas and at home events

  • నగరంలో నేడు ప్రభుత్వ క్రిస్మస్ వేడుకలు, రాష్ట్రపతి ఎట్ హోం కార్యక్రమం
  • ఎల్బీ‌స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు, ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
  • సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు

నగరంలోని ఎల్బీ స్టేడియంలో నేడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న క్రిస్మస్ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో పోలీసులు సాయంత్రం 5 నుంచి 9 గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఏఆర్ పెట్రోల్ బంక్ కూడలి నుంచి బషీర్‌బాగ్ బీజేఆర్ విగ్రహం కూడలివైపు వచ్చే ట్రాఫిక్‌ను నాంపల్లి లేదా రవీంద్ర భారతి వైపు మళ్లిస్తారు. అబిడ్స్, గన్‌ఫౌండ్రీ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను బషీర్‌బాగ్ బీజేఆర్ విగ్రహం కూడలి వైపు అనుమతించరు. గన్‌ఫౌండ్రీలోని ఎస్‌బీఐ నుంచి సుజాత స్కూల్, చాపెల్ రోడ్డు వైపు పంపిస్తారు. ట్యాంక్‌బండ్ నుంచి బషీర్‌బాగ్ కూడలి వైపు వచ్చే వాహనాలను లిబర్టీ జంక్షన్ నుంచి హిమాయత్ నగర్ వైపు పంపిస్తారు. 

కాగా, బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో శుక్రవారం ఎట్ హోం కార్యక్రమం దృష్ట్యా కూడా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ లోతుకుంట, టి.జంక్షన్, ఎంసీఈఎంఈ సిగ్నల్, లాల్ బజార్, టి.జంక్షన్, తిరుమలగిరి ఎక్స్‌రోడ్స్, సికింద్రాబాద్ క్లబ్‌ఇన్ గేట్, టివోలి కూడలి, ప్లాజా ఎక్స్ రోడ్, సీటీఓ, ఎస్‌బీఐ జంక్షన్, రసూల్‌పుర, పీఎన్‌టీ పైవంతెన, గ్రీన్‌‌ల్యాండ్, మొనప్ప కూడలి, ఖైరతాబాద్ వీవీ విగ్రహం జంక్షన్ వద్ద, పంజాగుట్ట, ఎన్ఎఫ్‌సీఎల్ ఎన్టీఆర్ భవన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్టుల వద్ద ట్రాఫిక్ నిలిపివేస్తారు.

Hyderabad Police
Christmas
At home
President Of India
  • Loading...

More Telugu News