Nitish Kumar: ప్రసంగాన్ని అనువదించాలని కోరిన డీఎంకే నేత.. హిందీ తెలిసి ఉండాల్సిందేనంటూ బీహార్ సీఎం ఫైర్

Bihar CM Nitish Kumar snaps at DMK leader for seeking speech translation
  • ‘ఇండియా’ కూటమి సమావేశంలో ఘటన
  • నితీశ్ ప్రసంగం అర్థంకాక పోవడంతో ఆర్జేడీ ఎంపీ సాయం కోరిన డీఎంకే నేత టీఆర్ బాలు
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నితీశ్ కుమార్
  • జాతీయ భాష హిందీ అందరికీ తెలిసి ఉండాల్సిందేనని వ్యాఖ్య

హిందీ ప్రసంగాన్ని అనువదించాలన్న డీఎంకే నేత టీఆర్ బాలుపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీ తెలిసి ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. మంగళవారం మూడు గంటలపాటు జరిగిన ‘ఇండియా’ కూటమి సమావేశంలో జరిగిందీ ఘటన. కూటమిని ఉద్దేశించి నితీశ్ కుమార్ ప్రసంగిస్తున్నప్పుడు డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, టీఆర్ బాలు అక్కడే ఉన్నారు. 

నితీశ్ హిందీ ప్రసంగం అర్థం కాకపోవడంతో ఆర్జేడీ రాజ్యసభ సభ్యుడు మనోజ్ కే ఝా వైపు చూస్తూ.. నితీశ్ స్పీచ్‌ను ట్రాన్స్‌లేట్ చేయగలరా? అని అడిగారు. దీంతో ఆయన నితీశ్ అనుమతిని కోరారు. దీనికి ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘‘మనం మన దేశాన్ని హిందూస్థాన్ అని పిలుస్తాం. హిందీ మన జాతీయ భాష. మనకు ఆ భాష తెలిసి ఉండాలి’’ అని పేర్కొన్నారు. అంతేకాదు, తన ప్రసంగాన్ని అనువదించవద్దని మనోజ్‌ను కోరారు.

  • Loading...

More Telugu News