Anushka Sharma: రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న కోహ్లీ దంపతులు.. ఇదే ఆధారం!

Virat Wife Anushka Sharma latest Instagram post cements second pregnancy rumours

  • అభిమానుల్లో అనుమానం పెంచిన అనుష్క ప్రెగ్నెన్సీ కిట్ యాడ్
  • తమకు అర్ధమైందంటూ కామెంట్లు
  • మరికొందరు కంగ్రాట్స్ కూడా చెప్పేస్తున్న వైనం
  • మౌనం వీడని విరుష్క దంపతులు

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్కశర్మ గురించిన వార్తలు ఇటీవల మళ్లీ వైరల్ అవుతున్నాయి. ఆమె రెండోసారి గర్భం దాల్చిందనేదే ఆ వార్తల సారాంశం. ఈ విషయంలో అటు కోహ్లీ కానీ, ఇటు అనుష్క కానీ ఎలాంటి కామెంట్లు చేయకున్నా.. ప్రెగ్నెన్నీ కిట్‌పై అనుష్క చేసిన యాడ్, సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫొటో చూస్తుంటే ప్రెగ్నెన్సీ వార్తలు నిజమేనని అనిపిస్తోంది. నిజానికి వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందునుంచే అనుష్క గర్భవతి అన్న వార్తలు షికారు చేశాయి. 

అనుష్కశర్మ తన ఇన్‌స్టా ఖాతాలో ‘ప్రెగాన్యూస్’ అనే ప్రెగ్నెన్సీ కిట్‌కు సంబంధించిన యాడ్‌ను పోస్టు చేసింది. అలాగే, కోహ్లీతో కలిసి ఉన్న మరో ఫోటో కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అందులో అనుష్క ఓ చేత్తో తన పొట్టను పట్టుకుంది. ఇది కూడా ఊహాగానాలకు కారణమైంది. 

అనుష్క యాడ్ చూసిన వారు.. ‘మీరేం చెప్పాలనుకుంటున్నారో మాకు అర్థమైంది’ అని కామెంట్లు చేస్తున్నారు. ‘దీనర్థం ఏంటంటే మీరు రెండోసారి గర్భవతి అయ్యారు’ అని మరో యూజర్ రాసుకొచ్చాడు. చాలామంది అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఇప్పటికైనా విరుష్క దంపతులు ఈ విషయంలో క్లారిటీ ఇస్తారో? లేదో? చూడాల్సిందే! 


వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Anushka Sharma
Virat Kohli
Team India
Bollywood
Anushka Shetty Pregnancy
  • Loading...

More Telugu News