WHO: రోజుకు ఒక పెగ్ ఫర్వాలేదా... మద్యంపై డబ్ల్యూహెచ్ఓ ఏం చెబుతోందంటే...!

WHO report on alcohol consumption
  • మద్యం ఒక విష పదార్థమన్న డబ్ల్యూహెచ్ఓ
  • అది ఎంత మోతాదులో తీసుకున్నా శరీరానికి హాని కలిగిస్తుందని వెల్లడి
  • రోజుకు ఒక పెగ్ అంశంపై శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టీకరణ
మద్యం ఆరోగ్యానికి హానికరం. ఇది అందరూ అంగీకరించే వాస్తవం. అయితే రోజుకు ఒక పెగ్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని అక్కడక్కడా అభిప్రాయాలు వినిపిస్తుంటాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆసక్తికర నివేదిక తీసుకువచ్చింది. ఓ వ్యక్తి రోజుకు ఎంత మద్యం సేవిస్తే ఆరోగ్యదాయకం అనే అంశం ఈ నివేదికలో ప్రధాన అజెండా. 

ఇక, ఆ నివేదికలో ఏం చెప్పారంటే... ఒక పెగ్ కాదు కదా, మద్యం ఎంత మోతాదులో శరీరంలోకి వెళ్లినా అది ఆరోగ్యానికి హానికరమేనని స్పష్టం చేశారు. మద్యం సేవించడం హానికరం అని, రోజుకు ఒక పెగ్ ఫర్వాలేదు అని చెప్పడానికి పరిశోధనాత్మక ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. 

మద్యం అనేది విష పదార్థం తప్ప మరొకటి కాదని, దీని కారణంగా పలు రకాల కేన్సర్లు, కాలేయ సంబంధిత సమస్యలు, గుండె సంబంధిత జబ్బులు కూడా వస్తాయని వివరించింది. రోజుకు ఒక పెగ్ తీసుకుంటే ఆరోగ్యదాయకం కాదని, మద్యానికి దూరంగా ఉండడమే ఆరోగ్యదాయకం అని డబ్ల్యూహెచ్ఓ తన నివేదికలో స్పష్టం చేసింది.
WHO
Alcohol
Daily Consumption
Health
Drink

More Telugu News