Mumbai Indians: హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా ప్రకటించిన గంటలోనే ముంబై ఇండియన్స్‌కి ఊహించని షాక్

shock for Mumbai Indians within an hour of announcing Hardik Pandya as captain of team

  • ప్రకటన వెలువడిన గంటలోనే టీమ్ ‘ఎక్స్’ పేజీని అన్‌ఫాలో చేసిన 4 లక్షల మంది ఫ్యాన్స్
  • 5 సార్లు టైటిల్స్ అందించిన రోహిత్ స్థానంలో పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించడంపై కొందరు ఫ్యాన్స్ అసంతృప్తి
  • జట్టు కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యాను శుక్రవారం సాయంత్రం ప్రకటించిన ముంబై ఇండియన్స్

ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ జట్టులో కీలక మార్పు జరిగింది. రోహిత్ శర్మ స్థానంలో టీమ్ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా పేరును యాజమాన్యం ప్రకటించింది. అయితే ఈ ప్రకటన వెలువడిన గంట వ్యవధిలోనే ముంబై ఇండియన్స్‌కి ఊహించని షాక్ తగిలింది. టీమ్ అఫీషియల్ ‘ఎక్స్’ పేజీని గంటలోపే 4 లక్షల మంది అన్‌ఫాలో చేశారు. దీంతో గంటలోనే పెద్ద సంఖ్యలో ఫాలోయర్లను టీమ్ కోల్పోయింది. ఏకంగా 5 ఐపీఎల్ టైటిల్స్‌ను అందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టడాన్ని కొందరు ముంబై ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారని ఈ పరిణామం తెలియజేస్తోంది.

కాగా రోహిత్ శర్మ 2013 నుంచి ఈ ఏడాది సీజన్ 2023 వరకు ముంబై ఇండియన్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించాడు. రికార్డు స్థాయిలో 5 సార్లు టైటిళ్లు గెలిపించారు. కాగా రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యాను శుక్రవారం సాయంత్రం ముంబై ఇండియన్స్ ప్రకటించింది. భవిష్యత్తుకు సిద్ధంగా ఉండేందుకు కట్టుబడి ఉన్నామని వివరణ ఇచ్చింది. సచిన్ టెండూల్కర్ నుంచి హర్భజన్ వరకు, రికీ పాంటింగ్ నుంచి రోహిత్ వరకు అసాధారణమైన నాయకత్వాన్ని అందించారని కొనియాడింది. కాగా ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన హార్దిక్ పాండ్యా గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించాడు. తిరిగి వచ్చే సీజన్‌లో ముంబైకి ఆడబోతున్నాడు. 

  • Loading...

More Telugu News