Vivek Ramaswamy: అమెరికాకు ఓ హిందువు అధ్యక్షుడు అవ్వకూడదన్న ఓటర్.. వివేక్ రామస్వామి సమాధానం ఇదీ!

US Presidential candidate Vivek Ramaswamy asked about his Hindu faith

  • ఐయోవా రాష్ట్రంలో ప్రచారం సందర్భంగా మతవిశ్వాసాలపై రిపబ్లికన్ నేతకు సూటి ప్రశ్నలు
  • అమెరికాకు ఓ హిందువు అధ్యక్షుడు కాజాలడంటూ ఓ ఓటర్ వ్యాఖ్య
  • ఆ అభిప్రాయం తప్పని పేర్కొన్న వివేక్
  • తాను హిందువునని గర్వంగా ప్రకటించుకున్న వైనం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన పార్టీ తరపున బరిలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్న రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి గురువారం ఐయోవా రాష్ట్రంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఓటర్ల నుంచి పలు కీలక ప్రశ్నలు ఎదురయ్యాయి. హిందువైన వివేక్ అమెరికాకు అధ్యక్షుడు కాజాలడంటూ ఓ ఓటర్ వ్యాఖ్యకు ఆయన సూటిగా సమాధానం ఇచ్చారు. ఆ అభిప్రాయం తప్పని తేల్చి చెప్పారు. 

‘‘ఈ అభిప్రాయంతో నేను ఏకీభవించలేకపోతున్నా. ఎన్నికల్లో గెలుపు కంటే నిజం చెప్పి ఓడిపోవడమే నయమని నేను అనుకుంటున్నా. నేను హిందువుని. చిన్నప్పుడు క్రిస్టియన్ స్కూళ్లల్లో చదువుకున్నా. రెండు మతాల్లోనూ ఒకే తరహా విలువలు ఉన్నాయని నేను నమ్మకంగా చెబుతున్నా. దేవుడు ప్రతి ఒక్కరిని ఓ కారణంతో ఈ భూమ్మీదకు పంపించాడని నా మతం చెబుతోంది. ఈ బాధ్యతను నిర్వర్తించాల్సిన నైతిక బాధ్యత మనందరిపైనా ఉంది. దేవుడు మనందరిలో ఉన్నాడు కాబట్టి మనుషులందరూ సమానమే. భగవంతుడు ఒక్కొక్కరికీ ఒక్కో బాధ్యత అప్పగిస్తాడు. దైవసంకల్పం మనం పాటించాల్సిందే. అందుకే మొదట ఓల్ట్ టెస్టమెంట్ వచ్చింది. ఆ తరువాత బుక్ ఆఫ్ ఇసాయా. ఆ సందర్భంలో దేవుడు సైరస్‌కు యూదులను తమ పవిత్ర ప్రాంతానికి తరలించే అవకాశం ఇచ్చాడు. కాబట్టి, దేవుడు నాకూ ఓ లక్ష్యం ఇచ్చాడని నమ్ముతున్నాను. ఆ నమ్మకమే నన్ను అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేలా చేసింది’’ అని వివేక్ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News