Nara Lokesh: ఉద్యోగాల భర్తీలో తెలంగాణ విధానాన్ని ఏపీలోనూ అమలు చేయాలి: నారా లోకేశ్

Nara Lokesh demands AP govt should implement Telangana system in jobs recruitments

  • సీఎం జగన్ కు లోకేశ్ లేఖాస్త్రం
  • గ్రూప్స్ రాసే అభ్యర్థుల వయోపరిమితి పెంచాలని డిమాండ్
  • ఏటా ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ ఏదంటూ నిలదీత
  • మీ నిర్లక్ష్యం ఏపీ యువత భవిష్యత్తును నాశనం చేసిందంటూ ఆగ్రహం 

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు. తెలంగాణలో అమలు చేస్తున్న ఉద్యోగాల భర్తీ విధానాన్ని ఏపీలోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచాలని కోరారు. ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న మాట ఏమైందని నిలదీశారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తూ మరోసారి వంచనకు సిద్ధపడ్డారా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్ల మీ నిర్లక్ష్యం ఏపీ యువత భవిష్యత్తును అంధకారంలో పడేసిందని లోకేశ్ విమర్శించారు.

Nara Lokesh
Letter
Jagan
Jobs
Recruitment
TDP
Andhra Pradesh
Telangana
  • Loading...

More Telugu News