Payal Rajput: కాంతారా సీక్వెల్ లో అవకాశం ఇవ్వండి ప్లీజ్..! పాయల్ రాజ్ పుత్

Payal Rajput Request To Rishab Shetti For KANTARA Movie Chance

  • చాప్టర్ 1 లో చాన్స్ కోసం డైరెక్టర్ రిషబ్ శెట్టికి విజ్ఞప్తి
  • సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హీరోయిన్.. రీట్వీట్ చేస్తున్న ఫ్యాన్స్
  • ఇటీవల మంగళవారం సినిమాతో హిట్ కొట్టిన పాయల్

కాంతారా సీక్వెల్ లో నటించాలని ఉందంటూ ప్రముఖ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తన మనోగతం వెల్లడించారు. ఆ సినిమా హీరో, దర్శకుడు రిషబ్ శెట్టికి ఈమేరకు ఓ రిక్వెస్ట్ కూడా పెట్టారు. సోషల్ మీడియాలో పాయల్ రాజ్ పుత్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. కాంతారా సినిమా సృష్టించిన రికార్డుల గురించి తెలిసిందే. విడుదలైన ప్రతీ భాషలోనూ సూపర్ హిట్ గా నిలిచింది. 

ఇక ఈ సినిమాకు లభించిన ప్రేక్షకాదరణ చూసి డైరెక్టర్ రిషబ్ శెట్టి కాంతారాకు సీక్వెల్ రూపొందిస్తున్నారు. కాంతారా సీక్వెల్ కు ‘చాప్టర్ 1’ టైటిల్ ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ సినిమాలో ఆర్టిస్టుల ఎంపిక జరుగుతోంది. ఈ విషయాన్ని కాంతారా టీమ్ మీడియా ముఖంగా ప్రకటించి, ఆడిషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. దీంతో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తనకు అవకాశం ఇవ్వాలని రిక్వెస్ట్ చేసింది.

ఆర్ఎక్స్ 100 సినిమాతో పాయల్ రాజ్ పుత్ కు మంచి క్రేజ్ లభించింది. ఇటీవల పాయల్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘మంగళవారం’ కూడా హిట్ టాక్ సంపాదించుకుంది. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన పాయల్ రాజ్ పుత్.. కాంతారా చాప్టర్ 1 సినిమాకు ఆడిషన్స్ జరుగుతున్న విషయాన్ని ప్రస్తావించింది. ఈ సినిమాలో నటించాలని ఉందని, తనకు ఆడిషన్ కు సమయం ఇవ్వాలని రిషబ్ శెట్టిని కోరింది. ‘మంగళవారం’ సినిమాలో తన నటనను చూడాలని విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేసింది. రిషబ్ శెట్టితో పాటు హోంబలె ఫిల్మ్స్ ను కూడా ట్యాగ్ చేసింది. దీంతో పాయల్ అభిమానులు దీనిని రీట్వీట్ చేస్తూ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. తన అభిమానుల రియాక్షన్ పై స్పందించిన పాయల్.. అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Payal Rajput
Katara
Chapter 1
Rishab Shetti
Movie chance
Hombale Films
Mangalavaram
  • Loading...

More Telugu News