CM Revanth Reddy: ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్

  • శరవేగంగా సాగుతున్న సీఎం ప్రమాణ స్వీకార ఏర్పాట్లు
  • భద్రతపై ఉన్నతాధికారులతో సీఎస్ సమావేశం
  • రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులుగా ప్రమాణం
  • కేబినెట్ కూర్పుపై ఇప్పటికే స్పష్టత
Telangana CS directs officials to make elaborate arrangements for CM swearing in ceremony

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికోసం హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న పనులను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పరిశీలించారు. డీజీపీ రవి గుప్తా, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ లతో కలిసి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. శానిటేషన్ ఏర్పాట్లను ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహణ, ఇతర ఏర్పాట్లపై ఎల్బీ స్టేడియంలో సీఎస్ శాంతికుమారి సమన్వయ సమావేశం నిర్వహించారు. పోలీస్ ఉన్నతాధికారులతో పాటు కాంగ్రెస్ నేతలు, సాధారణ పరిపాలన అధికారులతో చర్చించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉదయం 10:28 గంటలకు ఉంటుందని అధికారులు తొలుత చెప్పారు. అయితే, తర్వాత  ఈ ముహూర్తాన్ని మధ్యాహ్నం  1.04 గంటలకు మార్చినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, మంత్రులుగా 9 లేదా 18 మంది ఇదే వేదికపై ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని సమాచారం.

  • Loading...

More Telugu News