Kalyanram: మరో డిఫరెంట్ కంటెంట్ తో రంగంలోకి కల్యాణ్ రామ్!

Kalyanram in Pavan Sadhineni Movie
షార్ట్స్‌లో చూడండి
కల్యాణ్ రామ్ తన తాజా చిత్రమైన 'డెవిల్' ను ఆడియన్స్ ముందుకు తీసుకుని రావడానికి రెడీ అవుతున్నాడు. నవీన్ మేడారం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా మాళవిక నాయర్ అలరించనుంది. ఈ సినిమాలో ఆయన డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. డిఫరెంట్ కంటెంట్ కావడంతో అందరిలో ఆసక్తి ఉంది. 

ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, ఆ తరువాత ప్రాజెక్టును కల్యాణ్ రామ్ లైన్లో పెట్టినట్టుగా చెబుతున్నారు. ఆయన తన తదుపరి సినిమాను పవన్ సాధినేని దర్శకత్వంలో చేయనున్నట్టుగా సమాచారం. 'ప్రేమ ఇష్క్ కాదల్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న పవన్ సాధినేని, ఆ తరువాత వరుసగా వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉన్నాడు.

మళ్లీ ఇప్పుడు కల్యాణ్ రామ్ సినిమా కోసం రంగంలోకి దిగాడు. కొంతకాలం క్రితమే కథ ఓకే అయినప్పటికీ ముహూర్తం ఇప్పుడు కుదిరిందని టాక్. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు మొదలు కానున్నాయని అంటున్నారు. ఈ సినిమా తరువాత 'బింబిసార 2' ప్రాజెక్టును చేయడానికి కల్యాణ్ రామ్ ఏర్పాట్లు చేసుకుంటున్నాడని చెబుతున్నారు. 
Go Back to Shorts
Kalyanram
Pavan Sadhineni
Devil Movie

More Telugu News