Stock Market: ఎన్నికల ఫలితాలతో స్టాక్ మార్కెట్ జోరు

  • 20,500 పైకి చేరిన నిఫ్టీ
  • సెన్సెక్స్ 30 సూచీలోని షేర్లు అన్ని లాభాల్లో ట్రేడ్
  • మార్కెట్ పై సానుకూల ప్రభావం చూపిన బీజేపీ గెలుపు
Josh In Stock Market due to BJP victory in 3 states

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స్టాక్ మార్కెట్ కు కొత్త ఊపు తెచ్చాయి. నాలుగింట మూడు రాష్ట్రాలను బీజేపీ కైవసం చేసుకోవడంతో నిఫ్టీ, సెన్సెక్స్ జోరు కనబరిచాయి. నిఫ్టీ 20,500 పాయింట్ల పైకి చేరి కొత్త గరిష్టాన్ని నమోదు చేయగా.. సెన్సెక్స్ 30 లోని షేర్లు అన్నీ లాభాల్లో ట్రేడ్ అవుతుండడం విశేషం. సోమవారం సూచీలన్నీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 825 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 68,306 దగ్గర ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ కూడా 248 పాయింట్లు పెరిగి 20,516 వద్ద ట్రేడ్ అవుతోంది.

సెన్సెక్స్ 30 లోని ఎస్ బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్, ఎన్ టీపీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, ఎల్ అండ్ టీ తదితర షేర్లు ఒక శాతం పైగా లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. ఓవైపు శుక్రవారం అమెరికా మార్కెట్లు లాభాలతో ముగియడం, మరోవైపు ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో మార్కెట్లు జోరు మీదున్నాయి. వచ్చే ఏడాది నుంచి వడ్డీ రేట్లలో కోత ఉండవచ్చనే సంకేతాలు కూడా మార్కెట్ల జోరుకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News