Vijayashanti: తెలంగాణకు మంచి రోజులు వచ్చాయి: విజయశాంతి

  • కాంగ్రెస్ పార్టీది ధర్మవిజయమన్న విజయశాంతి
  • కాంగ్రెస్ పార్టీని గెలిపించిన వారందరికీ విజయశాంతి ధన్యవాదాలు
  • రేవంత్ రెడ్డి తనను ప్రశంసించిన వీడియోను ట్వీట్ చేసిన రాములమ్మ
Vijayashanti tweets about congress winning

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీది ధర్మవిజయమని ఆ పార్టీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తెలంగాణకు మంచి రోజులు వచ్చాయన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అలాగే సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.

ఆ తర్వాత తనకు ధన్యవాదాలు తెలుపుతూ రేవంత్ రెడ్డి మాట్లాడిన మరో వీడియోను విజయశాంతి ట్వీట్ చేశారు. విజయశాంతి పార్టీ కోసం జోరుగా ప్రచారం నిర్వహించారని, ఆమె ప్రచారంలో పాల్గొని... కాంగ్రెస్‌ను తనదైన శైలిలో ముందుకు నడిపించారని, కాంగ్రెస్ కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపారని రాములమ్మను రేవంత్ రెడ్డి ఆ వీడియోలో ప్రశంసించారు. కాగా, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నంత సేపు సీఎం.. సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలు చేస్తుండడం ఆ వీడియోలో కనిపించింది. 

More Telugu News