Chandrababu: గన్నవరం నుంచి విజయవాడ వచ్చేందుకు చంద్రబాబుకు 5 గంటల సమయం... టీడీపీ అధినేతపై పూల వర్షం

Huge welcome for Chandrababu in Gannavaram constituency
  • తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న చంద్రబాబు
  • ప్రత్యేక విమానంలో గన్నవరం చేరిక
  • విజయవాడ వచ్చే క్రమంలో అడుగడుగునా బ్రహ్మరథం
  • రోడ్డుపైకి వచ్చి సంఘీభావం తెలిపిన మహిళలు
  • వాహనాలు నియంత్రించలేక ఇబ్బంది పడిన పోలీసులు
టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకుని విజయవాడ చేరుకున్నారు. అయితే, గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఆయన విజయవాడ చేరుకునేందుకు 5 గంటల సమయం పట్టింది. అడుగడుగునా పార్టీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టారు. 

చంద్రబాబుకు గన్నవరం నియోజకవర్గ ప్రజలు ఘనస్వాగతం పలికారు. మహిళలు రోడ్డుపైకి వచ్చి టీడీపీ అధినేతకు సంఘీభావం ప్రకటించారు. ప్రసాదంపాడు గ్రామస్తులు చంద్రబాబుపై పూలవర్షం కురిపించారు. 

ఈ నేపథ్యంలో, వాహనాలు నియంత్రించలేక ట్రాఫిక్ పోలీసులు ఇబ్బందిపడ్డారు. దాంతో, కాన్వాయ్ త్వరగా వెళ్లిపోవాలని పోలీసులు చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. కారు డోర్ వద్ద నిలబడి అభివాదం చేస్తూ చంద్రబాబు ముందుకెళ్లారు.
Chandrababu
Gannavaram Airport
Vijayawada
TDP
Andhra Pradesh

More Telugu News