Nagarjuna Sagar: సాగర్ నుంచి బలవంతంగా ఏపీ ప్రభుత్వం నీటి విడుదల.. షాకిచ్చిన తెలంగాణ అధికారులు

Nagarjuna Sagar water dispute between AP and Telangana

  • సాగర్ కుడి కాలువ నుంచి 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన ఏపీ
  • మోటార్లకు విద్యుత్ ను ఆపేసిన తెలంగాణ అధికారులు
  • కరెంట్ సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న ఏపీ అధికారులు

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీకి చెందిన ఇరిగేషన్ అధికారులు సాగర్ కుడి కాలువ నుంచి 2 వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. ఒంగోలు చీఫ్ ఇంజినీర్ సమక్షంలో నీటిని విడుదల చేశారు. అయితే ఇది జరిగిన కాసేపటికి నీటి విడుదల కు బ్రేక్ పడింది. ఏపీ మోటార్లకు తెలంగాణ అధికారులు విద్యుత్ ను నిలిపివేశారు. దీంతో, నీటి విడుదల ఆగిపోయింది. దీంతో, కరెంట్ సరఫరాకు ఏపీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. 

మరోవైపు దీనిపై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ... తాగునీటి అవసరాల కోసమే నాగార్జున సాగర్ రైట్ కెనాల్ కి నీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఇంకోవైపు, దీనిపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో సెంటిమెంట్ ను రగిల్చేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా ఈ వివాదాన్ని సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ కు లబ్ధి చేకూర్చేందుకు ఏపీ ప్రభుత్వం ఈ వివాదాన్ని సృష్టించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

Nagarjuna Sagar
Andhra Pradesh
Telangana
  • Loading...

More Telugu News