Telangana Assembly Election: పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశం ఇవ్వలేదని ఉపాధ్యాయ సంఘాల పిటిషన్.. విచారణ ముగించిన హైకోర్టు

Teachers association petition in High Court

  • పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశమివ్వలేదని.. ఓటు వేసే హక్కును కోల్పోతున్నామని కోర్టులో పిటిషన్ 
  • దరఖాస్తు చేసుకున్న వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించినట్లు తెలిపిన ఈసీ తరఫు న్యాయవాది
  • ఈసీ న్యాయవాది వాదనలను పరిగణనలోకి తీసుకొని విచారణను ముగిస్తున్నట్లు తెలిపిన హైకోర్టు

అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశం ఇవ్వలేదని, దీంతో తాము ఓటు వేసే హక్కును కోల్పోతున్నామని ఉపాధ్యాయ సంఘాలు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌కు సంబంధించి హైకోర్టులో విచారణ ఈ రోజు ముగిసింది. ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగులు.. పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకుంటే కనుక వారందరికీ ఆ మేరకు సౌకర్యం కల్పించామని ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నెల 28వ తేదీ వరకు లక్షా డెబ్బై ఐదు వేల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నట్లు కోర్టుకు తెలిపారు. ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకొని విచారణను ముగిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.

  • Loading...

More Telugu News