Naga Chaitanya: 'ది ఫ్యామిలీ మేన్' లో సమంత నటనపై నాగచైతన్య స్పందన

Naga Chaitanya opines on Samantha performance in The Family Man web series

  • 'ది ఫ్యామిలీ మేన్' వెబ్ సిరీస్ లో సమంత నటన అద్భుతమన్న చైతూ
  • ఆ వెబ్ సిరీస్ తనకు ఎంతో ఇష్టమని వెల్లడి
  • ప్రస్తుతం 'తండేల్' చిత్రంలో నటిస్తున్న నాగచైతన్య
  • నాగచైతన్య నటించిన 'దూత' వెబ్ సిరీస్ డిసెంబరు 1 నుంచి స్ట్రీమింగ్

టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగచైతన్య తన కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. నాగచైతన్య ప్రస్తుతం 'తండేల్' చిత్రంలో నటిస్తున్నారు. ఆయన తొలిసారిగా నటించిన 'దూత' వెబ్ సిరీస్ డిసెంబరు 1 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికపై స్ట్రీమింగ్ కానుంది. 

ఈ నేపథ్యంలో, నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ది ఫ్యామిలీ మేన్ సిరీస్ అంటే తనకు చాలా ఇష్టమని, అందులో సమంత నటన అమోఘం అని కొనియాడారు. సమంత ది ఫ్యామిలీ మేన్ సిరీస్ లో చాలా బోల్డ్ గా నటించిందంటూ అప్పట్లో రివ్యూలు వచ్చాయి. వైవాహిక జీవితంలో విభేదాల కారణంగా నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడం తెలిసిందే. 

ఇక, తన చిత్రాలు కొన్ని ఫ్లాప్ కావడం గురించి కూడా నాగచైతన్య స్పందించారు. ఫెయిల్యూర్స్ నుంచి అనేక విషయాలు నేర్చుకున్నానని... ఏ గురువు, ఏ తల్లిదండ్రులు, ఏ ఫ్రెండు చెప్పని విషయాలు మనకు వైఫల్యాలు చెబుతాయని అన్నారు. ఒక సినిమా ఫెయిల్ అయితే, అందుకు గల కారణాలను విశ్లేషించుకుని తర్వాత ప్రాజెక్టుకు సిద్ధమవుతానని తెలిపారు. 

ఏ సినిమా హిట్ అవుతుందో, ఏ సినిమా ఫ్లాప్ అవుతుందో ఎవరూ చెప్పలేరని, సినిమా జయాపజయాలు ప్రేక్షకుల చేతుల్లో ఉంటాయని నాగచైతన్య అభిప్రాయపడ్డారు. ఆమిర్ ఖాన్ తో నటించిన లాల్ సింగ్ చద్దా హిట్టవుతుందని భావిస్తే, అది నిరాశపరిచిందని వివరించారు.

Naga Chaitanya
Samantha
The Family Man
Tollywood
  • Loading...

More Telugu News