Emergency Landing: విమానంలో కొట్టుకున్న దంపతులు... ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

Flight emergency landing in Delhi airport due to brawl between wife and husband
  • మ్యూనిచ్ నుంచి బ్యాంకాక్ వెళుతున్న విమానం
  • విమానం గాల్లో ఉండగా దంపతుల మధ్య గొడవ
  • ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు నిరాకరించిన పాకిస్థాన్ అధికారులు
  • విమానం ఢిల్లీ వైపు మళ్లింపు
జర్మనీ నుంచి థాయ్ లాండ్ వెళుతున్న ఓ విమానం ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. అందుకు కారణం... విమానంలో భార్యాభర్తలు కొట్టుకోవడమే. 

లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ కు చెందిన నెం.ఎల్ హెచ్ 772 విమానం జర్మనీలోని మ్యూనిచ్ నుంచి థాయ్ లాండ్ లోని బ్యాంకాక్ వెళుతోంది. అయితే, విమానం గాల్లో ఉండగా ఓ జంట జగడానికి దిగింది. దంపతులు ఇరువురూ కీచులాడుకోవడంతో విమానంలో గందరగోళం ఏర్పడింది. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడికి ప్రయత్నించడంతో వారికి సర్దిచెప్పేందుకు విమాన సిబ్బంది విఫలయత్నాలు చేశారు. దాంతో, చేసేది లేక విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు యత్నించారు. 

అప్పటికి విమానం పాకిస్థాన్ గగనతలంపై ఉంది. పాక్ లోని ఓ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ కు అనుమతి కోరగా, అక్కడి అధికారులు నిరాకరించారు. దాంతో ఆ విమానాన్ని ఢిల్లీ వైపు మళ్లించారు. ఢిల్లీలో అధికారులు అనుమతించడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. వెంటనే భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకోగా, భర్తను విమాన సిబ్బంది పోలీసులకు అప్పగించారు.
Emergency Landing
Flight
Wife and Husband
Delhi Airport
Luftansa Airlines

More Telugu News