Chandrababu: న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా కుమారుడి పెళ్లి రిసెప్షన్ కు హజరైన చంద్రబాబు, నారా భువనేశ్వరి... ఫొటోలు ఇవిగో!

Chandrababu and Bhuvaneswari attends to Sidharth Luthra son wedding reception
  • ఢిల్లీలో సిద్ధార్థ లూథ్రా తనయుడి వివాహ విందు
  • ఈ రిసెప్షన్ కోసం ఢిల్లీ వచ్చిన చంద్రబాబు
  • చంద్రబాబు రాకతో సంతోషం వ్యక్తం చేసిన లూథ్రా
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి ఢిల్లీలో సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కుమారుడి పెళ్లి రిసెప్షన్ కు విచ్చేశారు. చంద్రబాబు, భువనేశ్వరి దంపతులకు సిద్ధార్థ లూథ్రా, ఆయన కుటుంబ సభ్యులు ఎంతో ఆత్మీయంగా స్వాగతం పలికారు. తన కుమారుడి వివాహ విందుకు చంద్రబాబు రావడం పట్ల లూథ్రా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ రిసెప్షన్ కు సంబంధించిన ఫొటోలను ఐటీడీపీ సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ రిసెప్షన్ కు భారత ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్‌కర్ కూడా విచ్చేశారు. ఆయనతో చంద్రబాబు ముచ్చటించడం కనిపించింది.

ఇటీవల చంద్రబాబుపై ఏపీ సీఐడీ నమోదు చేసిన స్కిల్ కేసుతో సిద్దార్థ్ లూథ్రా గురించి అందరికీ తెలిసింది. చంద్రబాబు కోసం లూథ్రా అనేక పర్యాయాలు వాదనలు వినిపించారు.

More Telugu News

Chandrababu
Nara Bhuvaneswari
Sidharth Luthra
Son
Wedding Reception
New Delhi
TDP
Andhra Pradesh