Chelluboina Venugopalakrishna: ఛాతీలో నొప్పితో ఆసుపత్రిలో చేరిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

Minister Chelluboina Venugopalakrishna admits hospital with chest pain

  • అస్వస్థతకు గురైన మంత్రి చెల్లుబోయిన
  • విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
  • మెరుగైన చికిత్స కోసం తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రికి తరలింపు
  • మంత్రిని 24 గంటల పరిశీలనలో ఉంచిన మణిపాల్ వైద్యులు

ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గుండెనొప్పితో ఆసుపత్రిలో చేరారు. ఛాతీలో నొప్పితో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ్నించి మెరుగైన వైద్యం కోసం తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మణిపాల్ ఆసుపత్రి వైద్యులు మంత్రి వేణుగోపాలకృష్ణను 24 గంటల పరిశీలనలో ఉంచారు. మంత్రి అస్వస్థతకు గురయ్యారన్న సమాచారంతో వైసీపీ శ్రేణులు ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నాయి.

Chelluboina Venugopalakrishna
Chest Pain
Hospital
Tadepalli
Vijayawada
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News