Ambati Rambabu: నువ్వు రాజకీయ విటుడివా... లేక రాజకీయ బ్రోకరువా!: పవన్ పై అంబటి ఫైర్

Ambati Rambabu take a jibe at Pawan Kalyan

  • తెలంగాణలో బీజేపీ తరఫున పవన్ ప్రచారం
  • చంద్రబాబు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నాడన్న అంబటి
  • ఏం బతుకులయ్యా మీవి? అంటూ విమర్శలు
  • రాజకీయ వ్యభిచారం చేస్తున్నారా? అంటూ వ్యాఖ్యలు

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేస్తుండడం పట్ల ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు. "పదేళ్ల నుంచి రాజకీయాలు చేస్తున్నావు... నువ్వు రాజకీయ నాయకుడివా, లేక రాజకీయ నటుడివా... లేకపోతే రాజకీయ విటుడివా... లేక రాజకీయ బ్రోకరువా..." అంటూ ధ్వజమెత్తారు. 

"అసలు నీ వ్యక్తిత్వం ఏంటి? నీ వ్యవహారం ఏంటి? ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతోంది? తెలంగాణ రాజకీయాల్లో నీ పాత్ర ఏంటి? తెలంగాణలో నువ్వు ఎవరికి మద్దతు ఇస్తున్నావ్? చంద్రబాబు ఎవరికి మద్దతు ఇస్తున్నాడు? 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తున్న పార్టీలు ఏంటి... ఒకటి బీఆర్ఎస్, మరొకటి బీజేపీ. కాంగ్రెస్ పార్టీని బీజేపీ, బీఆర్ఎస్ సవాల్ చేస్తుంటే నీ జెండా ఎక్కడ కట్టావ్... బీజేపీ పక్కన కట్టావ్. మరి చంద్రబాబు జెండా ఎక్కడ కట్టాడు... కాంగ్రెస్ పక్కన కట్టాడు. ఏం బతుకులయ్యా మీవి? చంద్రబాబేమో ఇంట్లో కూర్చుంటాడు... కాంగ్రెస్ మీటింగులు జరుగుతుంటే వాటిల్లో పచ్చ జెండాలు పైకి లేస్తుంటాయి. బీజేపీలో ఏమో నువ్వు డైరెక్టుగా వెళ్లి జెండాలు కట్టి కూర్చున్నావు. 

అక్కడ ఆ నాటకం... ఏపీలో ఏమో ఈ నాటకం. మీ బతుకులేంటని అడుగుతున్నా. ఇంత నీచమైన రాజకీయాలు చేసేది చంద్రబాబు అయితే, ఆయనను కూడా మించిపోయిన వ్యక్తి పవన్ కల్యాణ్. మీరు రాజకీయాలు చేస్తున్నారా, లేక రాజకీయ వ్యభిచారం చేస్తున్నారా? అక్కడ బీజేపీ, ఇక్కడ టీడీపీ! నువ్వు బీజేపీకి సెకండ్ సెటప్పువా... లేక ఇక్కడ టీడీపీకి సెకండ్ సెటప్పువా! అసలు నీ బ్రతుకేంటి? ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. 

ఇంతటి దారుణమైన రాజకీయ క్రీడలో పవన్ కల్యాణ్ మహత్తరమైన నాటకాలు ఆడుతున్నారు. కేవలం ప్యాకేజీలు తీసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా నువ్వు చేస్తున్న రాజకీయాల పట్ల నోరు విప్పి మాట్లాడు... సవాల్ చేస్తున్నా... నాతో చర్చకు వచ్చే దమ్ముందా అని అడుగుతున్నా. ఇదేమైనా సినిమా అనుకున్నావా... తెలంగాణలో ఒక డ్యాన్సు చేస్తావు, ఏపీలో మరో డ్యాన్సు చేస్తావు. ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ చేయడానికి ఇవి సినిమాలు కావు... రాజకీయాలు.

ప్రజలు కొద్దో గొప్పో నిన్ను నమ్ముకున్నారు. వాళ్లందరినీ నట్టేట ముంచే కార్యక్రమం చేస్తున్నావు. తెలంగాణలో బీజేపీకి, ఏపీలో టీడీపీకి మద్దతు ఇస్తున్నావు. నువ్వు కేవలం డబ్బు తీసుకుని పనిచేసే వ్యక్తిగానే తయారవుతున్నావు. అందుకే చాలా సందర్భాల్లో చెప్పాను... ఆయన పీకే కాదు కేకే అని. కేకే అంటే కిరాయి కోటిగాడు. ఎవరో అన్నారు కిరాయి కోటిగాడు బాగా లేదండీ... కిరాయి కల్యాణ్ అనండి... బాగా సూటవుతుంది అన్నారు. నువ్వు నిజంగా కిరాయి కల్యాణ్ వే. రౌడీలు కిరాయి తీసుకుని హత్యలు చేస్తుంటారు... నువ్వు కిరాయి తీసుకుని రాజకీయ హత్యలు చేసేందుకు ప్రయత్నించే వ్యక్తివి" అంటూ అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Ambati Rambabu
Pawan Kalyan
Chandrababu
Politics
YSRCP
Janasena
TDP
BJP
Congress
Andhra Pradesh
Telangana
  • Loading...

More Telugu News