Khushbu: దళితులను కించపరిచారంటూ.. నటి ఖుష్బూపై అట్రాసిటీ కేసు

  • మీలా తాను లోకల్ భాష మాట్లాడలేనన్న ఖుష్బూ వ్యాఖ్యలపై దళిత వర్గాల ఆగ్రహం
  • పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు
  • బహిరంగ క్షమాపణ చెప్పకుంటే ఇంటిని ముట్టడిస్తామన్న కాంగ్రెస్ ఎస్సీ విభాగం
  • ఖుష్బూ ఇంటి వద్ద భారీ భద్రత.. ఆపై వెనక్కి
Atrocity Case Against Actor Khushbu

ప్రముఖ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూపై అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. నటి త్రిషపై మన్సూర్ అలీఖాన్ చేసిన ‘రేప్’ వ్యాఖ్యలు ఇటీవల వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలను ఖష్బూ ఖండిస్తూ.. తన ఎక్స్ ఖాతాలో ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘మీలా నేను లోకల్ భాషలో మాట్లాడలేను’ అని పేర్కొన్నారు. దీంతో దళిత వర్గాలు భగ్గుమన్నాయి. దళితులు మాట్లాడే భాషను ఆమె కించపరిచారని, అట్రాసిటీ చట్టం కింద ఆమెపై చర్యలు తీసుకోవాలని వీసీకే నేతలు నిన్న పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

దళితులను కించపరిచేలా మాట్లాడిన ఖుష్బూ బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని, లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రంజన్ కుమార్ హెచ్చరించారు. త్రిష విషయంలో స్పందించిన ఖుష్బూ.. మణిపూర్ మహిళలపై జరిగిన అరాచకాల సమయంలో ఎక్కడున్నారని ప్రశ్నించారు. తాజా వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పకుంటే ఆమె ఇంటిని శుక్రవారం సాయంత్రం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆమె ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయితే, ముట్టడి వాయిదా పడడంతో భద్రతను వెనక్కి తీసుకున్నారు.

More Telugu News