Amitabh Bachchan: తన జుహు బంగ్లాను కుమార్తె శ్వేతాబచ్చన్‌కు గిఫ్ట్‌గా ఇచ్చేసిన అమితాబ్

Bollywood Big B Amitabh Bachchan gifts his Juhu bungalow Prateeksha to daughter Shweta

  • ఈ నెల 8న గిఫ్ట్‌డీడ్
  • అమితాబ్ తొలుత తల్లిదండ్రులతో కలిసి అదే ఇంట్లో నివాసం
  • ఈ ఏడాది జులైలో అంధేరిలో నాలుగు ఫ్లాట్ల కొనుగోలు
  • ఒక్కోదాని ఖరీదు రూ. 7.18 కోట్లు
  • ప్రభాస్ సినిమా ‘కల్కి 2898’, రజనీకాంత్ మూవీ ‘తలైవర్ 170’తో అమితాబ్ బిజీ

బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకెంతో ఇష్టమైన జుహు బంగ్లా ‘ప్రతీక్ష’ను కుమార్తె శ్వేతా బచ్చన్‌నందాకు బహుమతిగా ఇచ్చేశారు. ముంబై జుహు ప్రాంతంలో ప్రతీక్షలో రెండు ప్లాట్లు ఉన్నాయి. ఈ నెల 8నే గిఫ్ట్‌డీడ్ జరిగిందని, అందుకోసం స్టాంప్ డ్యూటీగా రూ. 50.65 లక్షలు చెల్లించినట్టు ‘మనీ కంట్రోల్’ రాసుకొచ్చింది.

తన తల్లిదండ్రులు తేజీ, హరివంశ్‌రాయ్ బచ్చన్‌తో కలిసి అమితాబ్ తొలుత ఇక్కడే ఉండేవారు. 81 ఏళ్ల అమితాబ్ ఈ ఏడాది జులైలో ముంబై అంధేరిలో ఉన్న ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌లోని 21వ అంతస్తులో నాలుగు ఫ్లాట్లను ఒక్కోదానిని రూ. 7.18 కోట్లతో కొనుగోలు చేశారు. అలాగే, కొన్నేళ్ల క్రితం ముంబైలోని అట్లాంటిస్‌లో రూ. 31 కోట్లతో 5,184 చదరపు అడుగుల వైశాల్యంతో వున్న ఫ్లాట్ ను కొన్నారు. ఇక ఇవన్నీ కాకుండా, ప్రస్తుతం అమితాబ్ నివశిస్తున్న 'జల్సా' అనే ఇండిపెండెంట్ హౌస్ వందలాది కోట్ల విలువ చేస్తుంది. 

అమితాబ్ చివరిసారి టైగర్ ష్రాఫ్ సినిమా ‘గణపతి’లో కనిపించారు. ప్రభాస్ సినిమా ‘కల్కి 2898’లో నటిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొణే, కమలహాసన్ లీడ్‌రోల్స్ చేస్తున్నారు. అలాగే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ 170వ సినిమా ‘తలైవర్ 170’లోనూ అమితాబ్ నటిస్తున్నారు. ప్రస్తుతం పాప్యులర్ టీవీ షో ‘కౌన్ బనేగా క్రోర్‌పతి 15’కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

Amitabh Bachchan
Shweta Bachchan Nanda
Prateeksha
Juhu Bunglow
  • Loading...

More Telugu News