Jagan: ఐఏఎస్ అధికారిణి పూనం మాలకొండయ్య కుమారుడి వివాహానికి హాజరైన సీఎం జగన్

CM Jagan attends IAS Poonam Malakondaiah son marriage

  • విజయవాడలో పూనం మాలకొండయ్య కుమారుడి వివాహం
  • పోరంకి ఎమ్ కన్వెన్షన్ సెంటర్ లో వేడుక
  • వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్

సీనియర్ ఐఏఎస్ అధికారిణి, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్నం మాలకొండయ్య దంపతుల కుమారుడు శ్రీధర్ వివాహం విజయవాడలో జరిగింది. పోరంకిలోని ఎమ్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ పెళ్లి వేడుకకు ఏపీ సీఎం జగన్ విచ్చేశారు. వధూవరులు అహల్య, శ్రీధర్ లకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. వైవాహిక జీవితంలో అడుగుపెడుతున్న ఆ నవ దంపతులకు తన ఆశీస్సులు అందించారు. సీఎం జగన్ రాకతో ఎమ్ కన్వెన్షన్ సెంటర్ లో మరింత కోలాహలం నెలకొంది. సీఎం జగన్ తో పాటు ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, తదితర వైసీపీ నేతలు కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు.

Jagan
Poonam Malakondaiah
Sreedhar
Wedding
Vijayawada
YSRCP
  • Loading...

More Telugu News