Mumbai Airport: ముంబయి ఎయిర్‌పోర్ట్‌కు బెదిరింపు మెయిల్‌.. మిలియన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్!

Mumbai airport receive mail seeking million dollars as ransom
  • ఎయిర్‌పోర్టు ఫీడ్‌బ్యాక్ ఇన్‌బాక్స్‌కు మెయిల్
  • బిట్‌కాయిన్ల రూపంలో డబ్బులు చెల్లించాలని డిమాండ్, 48 గంటల గడువు
  • డిమాండ్ నెరవేర్చకపోతే ఎయిర్‌పోర్టులోని టర్మినల్-2ను పేల్చేస్తామని హెచ్చరిక
  • ఎయిర్‌పోర్టు సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు 
మహారాష్ట్రలోని ముంబయి విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్ రావడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. వచ్చే 48 గంటల్లో ఒక మిలియన్ డాలర్లు బిట్‌కాయిన్ల రూపంలో చెల్లించకపోతే విమానాశ్రయంలోని టర్మినల్-2 పేల్చేస్తామని ఆగంతుకులు బెదిరించారు. ఈ మేరకు ఎయిర్‌పోర్టు ఫీడ్‌బ్యాక్‌కు గురువారం మెయిల్ పంపించారు. 24 గంటల తరువాత మరో మెయిల్ పంపిస్తామని కూడా నిందితులు తెలిపారు. దీంతో, విమానాశ్రయ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  

ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీకి కూడా ఇటీవల బెదిరింపు మెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. రూ.20 కోట్లు ఇవ్వకపోతే అంబానీని హత్యచేస్తానంటూ ఓ వ్యక్తి మెయిల్ పంపించాడు. ఆ తరువాత రూ.200 కోట్లు , రూ.400 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తెలంగాణకు చెందిన ఓ 19 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు.
Mumbai Airport
Bomb Threat
Maharashtra
Chhatrapati Shivaji Maharaj International Airport

More Telugu News