Balakrishna: బాలయ్య సరసన ఆ ఇద్దరు భామలకు ఛాన్స్?

Balayya 109 movie update
షార్ట్స్‌లో చూడండి
బాలకృష్ణ ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అవి కూడా సాధారణమైన విజయాలేం కాదు .. సంచలన విజయాలు. 'అఖండ' .. 'వీరసింహారెడ్డి' .. 'భగవంత్ కేసరి' సినిమాలతో బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు. ఆ తరువాత కూడా ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన మరో ప్రాజెక్టును లైన్లో పెట్టారు. 

బాలకృష్ణ తన నెక్స్ట్ సినిమాను బాబీ దర్శకత్వంలో చేయనున్నారు. కెరియర్ పరంగా ఇది ఆయనకు 109వ సినిమా. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. సితార నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా, యాక్షన్ .. ఎమోషన్స్ ను కలుపుకుంటూ బాలయ్య మార్కులోనే సాగుతుందనే టాక్ వినిపిస్తోంది. 

ఈ సినిమాలో కథానాయికలుగా ఎవరిని తీసుకుంటారా అనేది అందరిలో ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే త్రిష - మీనాక్షి చౌదరి పేర్లు తెరపైకి వచ్చాయి. గతంలో బాలయ్యతో కలిసి త్రిష 'లయన్' సినిమా చేసింది. ఇక ఈ సినిమాకి సంబంధించి ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Go Back to Shorts
Balakrishna
Trisha
Meenakshi Chaudary
Bobby

More Telugu News