Manda Krishna Madiga: ప్రజలకు సేవచేసే రఘునందన్ రావును గెలిపించండి: దుబ్బాకలో మంద కృష్ణ మాదిగ

Manda Krishna Madiga road show in the support of Raghunandan Rao

  • ఎవరు సరైన వారో నిర్ణయించుకొని ఓటు వేయాలని సూచించిన మంద కృష్ణ  
  • సామాజిక న్యాయం అంటే కేసీఆర్‌కు, కాంగ్రెస్ పార్టీకి నచ్చదని విమర్శలు
  • నరేంద్రమోదీతో మాత్రమే సామాజిక న్యాయం జరుగుతుందని వ్యాఖ్య

ప్రజలకు సేవ చేసే రఘునందన్ రావును ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిపించాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. బుధవారం దుబ్బాక పట్టణంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ఆయన రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని, ఏ కులానికీ వ్యతిరేకం కాదన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ చెప్పిన ప్రకారం తన జాతి అభివృద్ధి కోసం పోరాడుతున్నానని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య పోరాటం జరుగుతోందని, ఎవరు సరైన వారో నిర్ణయించుకునే అవకాశం ఓటర్లకు ఉందని గుర్తు చేశారు.

అయితే మహిళలకు రిజర్వేషన్ ఇచ్చి చట్టసభల్లోకి పంపుతానని చెప్పిన ఘనత ప్రధాని నరేంద్రమోదీదే అన్నారు. మహిళల కోసం రాజీనామా చేసింది అంబేడ్కర్ అయితే... వారికి రిజర్వేషన్లు మోదీ ఘనత అన్నారు. సామాజిక న్యాయం అనే మాట వింటే కేసీఆర్‌కు, కాంగ్రెస్ పార్టీకి నచ్చదని మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీతో మాత్రమే సామాజిక న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. సేవ చేసే రఘునందన్ రావును గెలిపించి అభివృద్ధి పనులు చేసుకోవాలని సూచించారు.

Manda Krishna Madiga
Raghunandan Rao
Narendra Modi
Telangana Assembly Election
BJP
  • Loading...

More Telugu News