Chandrababu: చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఏపీ సీఐడీ

CID challenges Chandrababu regular bail in Supreme Court

  • స్కిల్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన ఏపీ హైకోర్టు
  • ఈ నెల 28న జైలులో సరెండర్ కావాల్సిన అవసరం లేదన్న న్యాయమూర్తి
  • సుప్రీంకోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడాన్ని ఏపీ సీఐడీ తాజాగా సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. సీమెన్స్, ఫోరెన్సిక్ నివేదికలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని సీఐడీ తన పిటిషన్ లో పేర్కొంది.

సీఐడీ విభాగం చంద్రబాబును స్కిల్ కేసులో అరెస్ట్ చేయడం తెలిసిందే. 50 రోజులకు పైగా రిమాండ్ లో ఉన్న ఆయన ఇటీవల మధ్యంతర బెయిల్ పై బయటికి వచ్చారు. చంద్రబాబు ప్రస్తుతం కంటికి శస్త్రచికిత్స చేయించుకుని హైదరాబాదులోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. 

చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నిన్న వాదనలు విన్న ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. మధ్యంతర బెయిల్ షరతులు ఈ నెల 28 వరకే వర్తిస్తాయని, ఆయన మళ్లీ జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.

Chandrababu
Regular Bail
AP High Court
CID
Supreme Court
YSRCP
TDP
Andhra Pradesh
  • Loading...

More Telugu News