Lakshman: బ్రతకడం కోసం కూలి పనులు చేశాను: 'మంగళవారం' నటుడు లక్ష్మణ్ మీసాల

  • 'మంగళవారం'తో లక్ష్మణ్ కి పేరు 
  • చదువు సరిగ్గా సాగలేదని వెల్లడి 
  • దీక్షితులు గారు నటన నేర్పారన్న లక్ష్మణ్ 
  • వేరే సంపాదన లేదని వివరణ  

Lakshman Interview

'మంగళవారం' సినిమా చూసినవారు, అందులో చూపు సరిగ్గా లేని వ్యక్తిగా నటించిన లక్ష్మణ్ మీసాలను అంత తొందరగా మరిచిపోలేరు. అందుకు కారణం ఆ పాత్ర .. ఆయన నటన అనే చెప్పాలి. తాజాగా 'ఐ డ్రీమ్' కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన గురించిన అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. 

"పర్లాకిమిడి దగ్గర రాయనిపేట మాది. చదువు సక్రమంగా సాగలేదు .. మెడికల్ షాపులో కొంతకాలం పనిచేశాను. ఏం చేయాలనే ఆలోచన లేకుండానే హైదరాబాద్ వచ్చేశాను. బ్రతకడం కోసం బిల్డింగ్స్ నిర్మాణానికి సంబంధించిన కూలి పనులు చేశాను. చిరంజీవి గారి కొత్త ఇంటికి .. అల్లు అరవింద్ గారి ఇంటికి .. బన్నీగారి ఇంటికి సంబంధించిన కూలి పనులు కూడా చేశాను" అని అన్నాడు. 

"దీక్షితులుగారి దగ్గర నటన నేర్చుకున్నాను. ఈ రోజున నేను ఈ స్థాయికి రావడానికి కారకులు ఆయనే. ఆయన చెప్పిన మాటలు నన్ను మంచి మార్గంలో నడిపించాయి. సినిమా కాకుండా వేరే సంపాదనైతే లేదు. కానీ ఇంతవరకూ అయితే ఇబ్బంది పడలేదు. ఆ దేవుడే సమకూర్చుతున్నాడు" అంటూ చెప్పాడు. 

More Telugu News