Uttarkashi Tunnel: ఉత్తరకాశీ టన్నెల్‌లో చిక్కుకుపోయిన కార్మికులు క్షేమం.. బయటకు వచ్చిన ఫొటో ఇదిగో!

First visuals of workers trapped inside Uttarkashi silkyara tunnel surface online

  • 8 రోజులుగా టన్నెల్‌లోనే 41 మంది కార్మికులు
  • పైపులైను ద్వారా ఆహారం అందిస్తున్న అధికారులు
  • కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

ఉత్తరాఖండ్, ఉత్తరకాశీలోని కుంగిపోయిన సిల్క్‌యారా టన్నెల్‌లో చిక్కుకుపోయిన కార్మికుల ఫొటోలు తొలిసారి బయటకు వచ్చాయి. ఈ ఉదయం వెలుగులోకి వచ్చిన ఈ ఫొటోలు సోషల్  మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎనిమిది రోజుల క్రితం 41 మంది కార్మికులు టన్నెల్‌లో చిక్కుకుపోయారు.

వారిని రక్షించేందుకు అప్పటి నుంచి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న ఆరు అడుగుల వెడల్పాటి పైపు‌లైన్ ద్వారా వారికి ఆహారం అందించారు. చిక్కుకుపోయిన కార్మికులు ఎలా ఉన్నారో తెలుసుకునేందుకు టన్నెల్‌లోకి ఓ కెమెరాను పంపిన అధికారులు దాని ద్వారా వీడియో తీశారు. కార్మికులందరూ క్షేమంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Uttarkashi Tunnel
Silkyara Tunnel
Uttarakhand
  • Loading...

More Telugu News