Jyothi Kumar Yadav: టీమిండియా ఓటమితో గుండెపోటుకు గురై మరణించిన ఆంధ్రా టెక్కీ

AP techie collapsed to die after Team India lose in world cup

  • తిరుపతి జిల్లాలో విషాద ఘటన
  • నిన్న టీమిండియా, ఆసీస్ జట్ల మధ్య వరల్డ్ కప్ ఫైనల్
  • మ్యాచ్ ఓడిపోయాక కన్నీటితో మైదానాన్ని వీడిన రోహిత్ శర్మ
  • తీవ్ర భావోద్వేగాలకు లోనై కుప్పకూలిన జ్యోతికుమార్ యాదవ్

వరల్డ్ కప్ లో వరుస విజయాలతో అభిమానుల్లో ఆశలు రేకెత్తించిన టీమిండియా... ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడిపోవడం అభిమానులకు మింగుడుపడడంలేదు. టీమిండియాదే కప్ అని గట్టిగా నమ్మిన అభిమానులు మ్యాచ్ ఫలితంతో హతాశులయ్యారు. 

ఏపీకి చెందిన ఓ టెక్కీ టీమిండియా ఓటమిని తట్టుకోలేక గుండెపోటుకు గురై మరణించాడు. తిరుపతి జిల్లా దుర్గసముద్రం గ్రామానికి చెందిన జ్యోతికుమార్ యాదవ్ (32) ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. నిన్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూస్తూ ప్రాణాలు విడిచాడు. 

మ్యాచ్ ముగిశాక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కన్నీటితో మైదానాన్ని వీడడం టీవీలో చూసిన జ్యోతికుమార్ తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యాడు. ఆ తర్వాత కుప్పకూలిపోయాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అతడిని వెంటనే తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించామని, అప్పటికే అతడు మరణించినట్టు డాక్టర్లు నిర్ధారించారని తెలిపారు. 

జ్యోతికుమార్ తండ్రి టీటీడీ విశ్రాంత ఉద్యోగి. త్వరలోనే జ్యోతికుమార్ పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అంతలోనే ఈ ఘటన జరగడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Jyothi Kumar Yadav
Death
Cardiac Arrest
Team India
Australia
World Cup Final
Tirupati
Andhra Pradesh
  • Loading...

More Telugu News